Reading Time: < 1 minute

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహారిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కి లేఖ రాశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం దయ కాదని, అది తెలంగాణ ప్రజల హక్కు. అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు పనులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చ లో తెలంగాణ కి సంబంధించిన రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు బండి సంజయ్,

కిషన్ రెడ్డిలు చర్చించాలని ఆయన సూచించారు. పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రతి ఏడాది బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నదని ఆయన తెలిపారు. ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న బడ్జెట్‌లో సగం నిధులైన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలు, రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధిపై వివక్ష వద్దు అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ,బండి సంజయ్‌లు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు వాగ్దానం చేసిన కోచ్ ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన తెలిపారు.