
కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్‌లో యూసీడీ విభాగంలో సీఈఓగా పని చేస్తున్న మురళిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మూసాపేట సర్కిల్ పరిధిలో కమ్యూనిటీ ఆర్గనైజర్ (ఔట్సోర్సింగ్) ఏవో కే మురళి మూసాపేట సర్కిల్ పరిధిలో మహిళా పొదుపు సంఘానికి చెందిన మహిళల నుండి 20 లక్షల మంజూరు చేసిన రుణాన్ని ప్రాసెస్ చేసేందుకు గాను రూపాయలు 18,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ముందుగా ఎసిబి అధికారులను సంప్రదించగా వారి పథకం ప్రకారం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చెల్లించడానికి వెళ్లింది. దీంతో ముందుగా వేసుకున్న ప్రకారం ఫిర్యాదు ఆధారంగా ఎసిబి అధికారులు ఉచ్చుపన్నడంతో మురళి లంచం స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుకున్నారు. అనంతరం అధికారులు ఆయన వద్ద నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో మూసాపేట్ సర్కిల్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. సంబంధిత కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం