
త్వరలో యుద్ధానికి ముగింపు లభించే అవకాశం ఉందని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేస్తుంటే దానికి భిన్నంగా ఇరాన్ యుద్ధానికి మరింత కాలు దువ్వుతోంది. రెండు దశాబ్దాలుగా అమెరికా వివిధ దేశాలపై చేస్తున్న యుద్ధాలు, ఆ దేశ సైన్యం ఏ రకంగా ఓటమి పాలవుతున్నది అధ్యయనం చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అలీ అరాగ్చి అన్నారు. మా రాజధాని టెహ్రాన్‌పై బాంబు దాడులు చేసినా మా సామర్థంపై అది ఏమాత్రం ప్రభావం చూపదు. మేం యుద్ధం కొనసాగించేందుకే సిద్ధంగా ఉన్నాం. అది ఎప్పుడు, ఎలా ముగుస్తుందన్నది తెలియదు కానీ, ముగింపు మాత్రం మేమేం చేస్తాం అని అరాగ్చీ అన్నారు. ఇక ఇరాన్ సెక్యూరిటీ అధికారి అలీ లారిజాని ట్రంప్‌కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. మీ గాలి హెచ్చరికలకు ఇరాన్ భయపడబోదని అన్నారు. 20 రెట్లు కాదు.. అంతకన్నా ఎక్కువ చేసినా ఇరాన్‌ను తుడిచిపెట్టలేరని అన్నారు. మీ అధ్యాయం ముగిసిపోకుండా చూసుకోండి అని ట్రంప్‌ను లారిజాని హెచ్చరించారు.