Reading Time: < 1 minute

 దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్‌కు సంబంధించిన 22వ విడత నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దేశ వ్యాప్తంగా రూ.9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2000 వేల చొప్పున జమ కానున్నాయి. అస్సాంలోని గువాహతి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో పీఎం- కిసాన్ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రతి ఏటా మూడు దఫాలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం రూ.19వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. గత ఏడాది నవంబర్ 19వ తేదీన 21వ విడత పీఎం-కిసాన్ నిధులు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.