
ఢిల్లీ: లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుల వైఖరి సరిగా లేదని ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆరోపించారు. గందరగోళం సృష్టించేందుకే స్పీకర్ పై అవిశ్వాసం ప్రదర్శిస్తున్నారని అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ లోపల, వెలుపల కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని, లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా అడ్డుకునేందుకు కూడా యత్నించారని విమర్శించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, నిత్యం మన జాతిపిత మహాత్మగాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న వారు.. గాంధీజీ, అంబేద్కర్ బాటలోనే నడవాలని శ్రీకృష్ణ దేవరాయులు సూచించారు. లోక్ సభ ను స్పీకర్ ఓం బిర్లా చాలా బాగా నడిపిస్తున్నారని, ఓం బిర్లా హయాంలోనే ఎన్నో సానుకూల చర్చలు జరిగాయని అన్నారు. స్పీకర్ పై అవిశ్వాసం ఎందుకు పెట్టారో తెలియట్లేదని, ప్రజల దృష్టి మరల్చేందుకే అవిశ్వాస తీర్మానం ప్ర్రవేశ పెట్టారని శ్రీకృష్ణ దేవరాయులు పేర్కొన్నారు.