Reading Time: < 1 minute

 పశ్చిమబెంగాల్‌లో ఎస్‌ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై అనుమానాలు వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే వారి పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం ఏంటని సీజేఐ సూర్యకాంత్ ప్రశ్నించారు. జ్యుడిషియల్ అధికారులను కోర్టు నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తుతూ దాఖలైన తాజా పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది.‘న్యాయాధికారుల నుంచి ఇంతకంటే ఇంకా ఎలాంటి త్యాగాలు మీరు కోరుకుంటున్నారు?

తొలిగించిన ఓటర్లకు సంబంధించిన కేసులను పరిశీలించేందుకు న్యాయాధికారులు ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. వారిని అనుమానించే చర్యలను సహించేది లేదు’ అని సీజెఐ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా నుంచి తమను తొలగించారంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలిస్తున్న న్యాయాధికారులకు తగిన లాజిస్టిక్ సపోర్ట్ అందించాలని ఎన్నికల కమిషన్, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో పేర్కొంది.