Reading Time: < 1 minute

బృహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తం గా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శక ద్వయం అర్జున్, -కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధా లు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో రెచ్చగొట్టడం.. ఈ క్రమం లో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్‌కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

సన్‌స్టూడియో యూ ఎఫ్‌ఓతో కలిసి ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ “అందరూ తమ సినిమాని థియేటర్స్‌లో చూసి ఆశీర్వదిస్తే ఇలాం టి మంచి సినిమాలు మరెన్నో ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తామని అన్నారు. డైరెక్టర్ అర్జున్ మా ట్లాడుతూ.. “ఇది పూర్తిగా ఫన్ మూవీ” అని తెలిపారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “మేము చిన్న చినిమా చేసినా.. అద్భుతమైన సినిమా చే శాం. నేను కామెడీ రెచ్చిపోయి చేశా. ‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే చిత్రం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్తిక్, లక్ష్మణ్, అనన్య నాగ ళ్ల, శ్రీరామ చంద్ర, హరితేజ,హేమ పాల్గొన్నారు.