
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్‌లో ఈటీవి విన్ సత్తా చాటింది. ఈటీవిన్ నిర్మించిన చిత్రాలు ఏడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అనగనగా, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ -మౌనమే నీ భాష, బెస్ట్ డైరెక్టర్ సాయి లు కంపాటి( రాజు వెడ్స్ రాంబా యి), బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ -సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్) బెస్ట్ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ (రాజు రాంబాయి) ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్ కులకర్ణి (రాజు రాంబాయి)కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భం ఈటీవి విన్ మేకర్స్ విజేతలతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ “పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజకి, అలాగే రాజు వెడ్స్ రాంబాయి చిత్రాన్ని నన్ను చూడమని ఆహ్వానించిన వేణు ఉడుగులకి ధన్యవాదాలు. మట్టి వాసనతో సినిమా తీసి నా చిత్రమని చాటిచెప్పిన డైరెక్టర్ సాయిలుకి అభినందనలు. ఈ వేడుక చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
ఉత్తమ నటులు, ఉత్తమ గాయకులు ఉత్తమ దర్శకులు అందరూ కూడా యువత. యువతదే రాజ్యం అని నిరూపించిన సందర్భం ఇది”అని అన్నారు. ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. “మా రచయిత, దర్శకులు అందరికీ ధన్యవాదాలు. రామోజీరావు విజన్‌తోనే ఇదంతా సాధ్యపడింది. సినిమాలని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు”అని తెలిపారు. వేణు ఉడుగుల మాట్లాడుతూ “ఒక మంచి చిత్రానికి ప్రోత్సాహంగా నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు ఇచ్చిన ప్రభుత్వానికి, జూరీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తొలి దర్శకత్వం చేసే అవకాశం ఈటీవీ కల్పించింది. డాక్యుమెంటరీకి తొలిసారి రచయిత దర్శకుడిగా మారాను. ఇప్పుడు ఇంత కాలానికి నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కూడా ఈటీవీ సపోర్ట్ చేసింది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, నితిన్, సాయిలు కంపాటి, అనురాగ్ కులకర్ణి, సురేష్ బొబ్బిలి, రాహుల్, సాయి మార్తాండ్, ఆదిత్య హాసన్, సన్నీ, రాకేష్, వర ముళ్ళపూడి పాల్గొన్నారు.