Reading Time: < 1 minute

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన పరిస్థితి గురించి చెప్పానని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అనేది ఆలోచించేలా చేశారని అన్నారు. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.