
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో సత్య ఫన్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. మత్తు వలదరా వెనుక ఉన్న మెయిన్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారు. రితేష్ రాణా స్టైల్, హాస్యంతో పాటు హై-ఎనర్జీ యాక్షన్ మేళవించిన జెట్లీ ఫన్- ప్యాక్డ్ అనుభూతిని అందించబోతుంది.