Reading Time: < 1 minute

హైదరాబాద్: రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట సమాజంలోనికి వెళ్తోందని టివికె అధ్యక్షుడు విజయ్ ఉద్దేశించి ఆ పార్టీ నాయకురాలు రంజనా నాచ్చియర్ విమర్శించారు. మహిళల గౌరవాన్ని కాపాడే పదాలు విజయ్ నోటి వెంట రాకపోతే రాజకీయం ఎందుకుని అడిగారు. భార్యకు విజయ్ విడాకుల కోరడంతో పరోక్షంగా ఆయనపై ఘాటుగా స్పందించారు. మహళా దినోత్సవం సందర్భంగా అది వర్త్ కాదు అని వర్త్ కానది అయితే ‘మీ వైవాహిక జీవితం ఇదేనా?’ అని చురకలంటించారు. ఓ నటిని వెంట పెట్టుకొని తిరిగితే యువతకు ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. భార్యను ఇంట్లోకి రానివ్వకుండా ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎలా చెబుతారని రంజనా ఎద్దేవా చేశారు. ప్రతి బిడ్డకు మేనమామలాగా సారె ఇస్తానని చెబుతున్నారు కానీ కన్న కొడుకులు కూడా తండ్రికి ముఖ్యమే అనే విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. తమిళానాడు యువతకు ఎలా ఆదర్శం అవుతారని రంజనా ప్రశ్నించారు.