Reading Time: < 1 minute

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో నార్కట్ పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు ఘర్షణ పడుతుండగా లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. లారీని ఓవర్ టేక్ చేస్తూ తాకుతూ ట్రావెల్స్ బస్సు ముందుకెళ్లింది. లారీ డ్రైవర్ ఆగ్రహంతో లారీ, ట్రావెల్స్ బస్సును రహదారి పక్కన ఆపి డ్రైవర్లు ఘర్షణ పడ్డారు. లారీ వెనకాల ఉండి ఘర్షణ పడుతుండగా ఇంతలో వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. రెండు లారీల మధ్యలో ఇరుక్కుపోయి ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శ్రీనివాస్, బంగారయ్యగా పోలీసులు గుర్తించారు.