Reading Time: < 1 minute

విశాల్, సుందర్.సి కాంబోలో ఇది వరకు వచ్చిన ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచా యి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే క్రమం లో ఈ ఇద్దరూ కలిసి ‘మొగుడు’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. డా. ఎ.సి. షణ్ముఖం ఆశీస్సులతో అవని సినిమాస్ ప్రై.లి., బెంజ్ మీడియా ప్రై.లి. బ్యానర్లపై ఈ మూవీని అరుణ్ కుమా ర్, ఖుష్బూ సుందర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేష్, యోగి బాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.‘మొగుడు’ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రోమోను ఇదివరకే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ సాధారణ మొగుడిలా ఇం ట్లో అన్ని పనులు చేస్తూనే.. అండర్ కవర్ పోలీస్‌లా రౌడీలను చితక్కొట్టేశాడు విశాల్. ఈ మూవీని ఫుల్ మాస్ కమర్షియల్ యాంగిల్‌లో సుందర్. సి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా టైటిల్ ప్రోమోతో చెప్పకనే చెప్పేశారు. ఇక సుందర్. సి చిత్రాలకు మాస్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ‘మొగుడు’ మూవీని కూడా వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. ‘మొగుడు’ టీం ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక నెక్ట్‌ట్స్ షెడ్యూల్‌ను కోల్‌కత్తా, గోవా, చెన్నైలో ప్లాన్ చేశారు. ఈ మూవీకి సంగీతాన్ని హిప్‌హాప్ తమిళ అందిస్తున్నారు.