Reading Time: 2 minutes

 చెరువుల పునరుద్ధరణపై విమర్శలు పట్టించుకోను

నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తాం

పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు

మూసీ పునరుద్ధరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమే

కూకట్‌పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్

మనతెలంగాణ/ కూకట్‌పల్లి : వ్యక్తిగతంగా, రాజకీయంగా తనను ఇబ్బందులకు గురిచేస్తూ తిట్టిన తిట్లే తనకు ఆశీర్వాదాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ నుముల రేవంత్‌రెడ్డి తెలిపారు.హైడ్రా పునరుద్ధరించిన కూకట్‌పల్లి నల్ల చెరువును ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఎం రేవంత్ ప్రసంగించా రు. చెరువుల పునరుద్ధరణ వల్ల పేదలకు నష్టం జరిగి ఉండవచ్చు. నిర్వాసితుల్లో అర్హులైన పేదలుంటే వారికి డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇస్తాం. పేదవారి ఇల్లు కూల్చ డం ప్రభుత్వ ఉద్ధేశం కాదు. వరదల వల్ల ఇల్లు మునిగిపోతే కుటుంబం మొత్తం నష్టపోతుంది. వరద ముప్పును తప్పించాలంటే చెరువులను పునరుద్ధరించాలి. మూసీని పునరుద్ధరించకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు.

మూసీ పు నరుద్ధరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమే. ఎవరికైనా నష్టం జరిగితే మంచి పరిహారం ఇచ్చి ఆదుకుంటాం అని రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నియోజకవర్గాలను అన్ని వి ధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని, చెరువుల అభివృద్ధి కో సం నిధులను మంజూరు చేస్తానన్నారు. తాను రాజకీయాల్లో కష్టాలను అను భవి స్తున్న సమయంలో మల్కాజిగిరి ఎంపిగా గెలిపించి ఢిల్లీకి పంపించడాన్ని ఎన్న టికీ మరవబోనన్నారు. ముఖ్యంగా మల్కాజిగిరిలోని నియోజకవర్గంలో ఆనాడు చేయలేని అభివృద్ధి పనులను తాను సిఎంగా చేసి చూపిస్తానన్నారు.

చెరువులను, నాలాలను అభివృద్ధి చేసే సమయంలో కొంతమందికి జరిగే నష్టాలను తన దృష్టికి తీసుకువస్తే వారికి కావాలిసన పరిహారాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నామ న్నారు. ఢిల్లీ, ముంబాయి తదితర ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించుకోలేక ఆ నగరాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. మన నగరాన్ని అన్ని విధాలు గా అభివృద్ధి చేసుకునేందుకు కొంత మందికి ఇబ్బందులు ఎదురైనా రానున్న భావితరాల కోసం అనుభవించక తప్పదన్నారు. కూకట్‌పల్లి నియోజక వర్గంలోని ఐడిఎల్ సమీపంలోని కాలనీలో కార్మికుల నివాసాల కోసం తాను గతంలో కోటి రూపాయలను మంజూరు చేశామని గుర్తు చేశారు.

ఆయా కాలనీలోని నివాసితుల కోసం స్ధానిక ఎమ్మెల్యే నిధులను కేటాయించాలని విజ్ఞపి చేశారని, త్వరలోనే మంజూరు చేస్తానన్నారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే వారికి సరైన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ముఖ్యంగా నాలాలు, చెరువులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే విజ్ఞప్తులను పరిశీలించి నిధులను కేటాయిస్తామని అన్నారు. కర్యక్రమంలో ఎమ్మెల్యేలు కృష్ణారావు, గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాధ్ పాల్గొన్నారు.