Reading Time: < 1 minute

బెంగళూరు: సాంబార్ వంటకం విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కావ్య(27), రంగస్వామి అనే దంపతులు బెంగళూరు శివారులో నివస్తున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మూడో రోజుల క్రితం ఇంట్లో విందు కోసం సాంబార్ వంటకం చేసింది. సాంబార్‌ను ప్రీజులో పెట్టి మూడు రోజుల నుంచి భర్తకు వడ్డిస్తుండడంతో ఆమెపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కావ్య మనస్తాపానికి గురై బాత్రూమ్‌లోకి వెళ్లింది. పొలాల కోసం తెచ్చిన పురుగుల మందు తాగి బాత్రూమ్‌లో పడిపోయింది. బాత్రూమ్ నుంచి భార్య బయటకు రాకపోవడంతో రెండు మూడు సార్లు పిలిచిన ఉలుకుపలుకులేకపోవడంతో డోర్లు బద్దలు కొట్టాడు. భార్య అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. కావ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.