Reading Time: < 1 minute

 అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ వర్శిటీ

ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ

ఏర్పాట్లు చేయాలి ఒలింపిక్స్‌లో

తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలి క్రీడాశాఖపై

నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చేలా క్రీడాకారులకు శిక్షణ ఇ వ్వడానికి అవసరమైన అన్ని వసతులతో స్పోర్ట్ యూనివర్సిటీని సిద్ధం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించా రు. ఒలంపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా, ఒలంపిక్స్ లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన ని వాసంలో ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ రెడ్డి క్రీడాశాఖపై సమీక్ష నిర్వహించారు.

యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అంతర్జాతీయ ప్రమాణాల తో అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటు గురించి చర్చించారు. గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియాన్ని పునర్‌నిర్మించి ఆధునీకరించడంతో పాటు ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడ ల కోసం మైదానాలు ఇతర శిక్షణా సదుపాయాలను స్టేడియం ప్రాంగణంలో అభివృద్ధి చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రతిపాదిత నిర్మాణాలకు సంబంధించిన పలు ఆర్కిటెక్చర్ నమూనాలను సిఎం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

అదేవిధంగా, భవిష్యత్‌లో ఒలింపిక్స్, కామన్‌వెల్త్ వంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లకు తెలంగాణను వేదికగా నిలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఒలంపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారుల ప్రతిభను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడి యం, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాలని సిఎం సూచించా రు.

ఈ సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సిఎం ఓ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రాజు, శేషాద్రి, స్పోర్ట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా.జి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.