Reading Time: 2 minutes

 కల్తీ నూనె, గోధుమ పిండి ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై

ఎస్‌ఓటి పోలీసుల దాడి

భారీగా పట్టుబడ్డ కల్తీ నూనె, గోధుమ పిండి

గడువు ముగిసిన నూనె, గోధుమ పిండి సేకరించి కొత్త ప్యాకెట్లతో

మార్కెట్లో విక్రయాలు

మన తెలంగాణ/గచ్చిబౌలి: కల్తీ ఆహర పదార్థాలపై ఎస్‌ఓటి పోలీసులు చేస్తున్న దాడుల్లో రోజుకో కొత్త రకం కల్తీ పదార్ధాలు బయటపడుతున్నాయి. కల్తీ అల్లం పేస్ట్ కేసును మరవకముందే తాజాగా కల్తీ నూనె, గోధుమ పిండి పదార్థాలు పోలీసుల దాడుల్లో బయటపడ్డాయి. గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో కల్తీ నూనె, గోధుమ పిండి తయారీ కేంద్రంపై సోవమవారం మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో భారీ మొత్తం లో 5,026 లీటర్ల కల్తీ వంట నూనె, 5,192 కిలో ల గోధుమ పిండి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల ప్రకారం గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న జస్నాత్ ట్రేడర్స్ దుకాణం పై మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు.

రాజస్థాన్‌కు చెందిన దుకాణ యజమాని భన్వ ర్ రామ్ జాట్ (46), అతని కుమారు డు అశోక్ కుమార్ (22) జస్నాత్ ట్రేడర్స్‌ను నడుపుతున్నా రు. ఇద్దరూ గడువు ముగిసిన వివిధ కంపెనీల వం ట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనె తో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పా పాయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూ జా అయిల్ వంటి పేర్లతో మళ్లీ కొత్తగా ప్యాకింగ్ చేసి మార్కెట్లో నూనెను విక్రయిస్తున్నా రు. అలాగే పలు కంపెనీలకు చెందిన గడువు ము గిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాత్ గోల్డ్ చ క్కి ఆట పేరుతో తిరిగి ప్యాక్ చేసి మార్కెట్ లో అ మ్ముతున్నారు.

కాగా తండ్రి కొడుకులు కల్తీ నూనె, గోధుమ పిండి తయారు చేసి విక్రయిస్తున్నట్లు ప క్కా సమాచారం అందుకున్న ఎస్‌ఓటి పోలీసులు దుకాణంపై దాడి చేశారు. దాడిలో సుమారు 10,55,460 లక్షల విలువ చేసే 5,026 లీటర్ల క ల్తీ నూనె, 3,11,520 లక్షల విలువ చేసే 5,192 కల్తీ గోధుమ పిండి, ఒక వెయింగ్ మిషన్, ఒక ఆ యిల్ ఫిల్టర్ మిషన్, ఒక గోధుమ ఫిల్టర్ మిషన్, ఖాళీ సంచులు, రెండు మొబైల్ ఫోన్లు, టిఎస్07యుఎల్2884 నెంబర్ గల ఒక టెంపో ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.