Reading Time: < 1 minute

 ముఖ్యమంత్రికి తుమ్మల విజ్ఞప్తి

మినుము, వేరుశనగ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన తుమ్మల

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై మం త్రి తుమ్మల సిఎంతో చర్చించారు. సిద్ధిపేట జిల్లాలోని నర్మెట్ట ఆయిల్‌ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని మంత్రి తుమ్మల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. కొ హెడ మార్కెట్ పనులు చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వాలని సిఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

మినుము, వేరుశెనగ కొనుగోలు కేం ద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని సిఎం రేవంత్‌రెడ్డికి తుమ్మల విన్నవించా రు. తుమ్మల ప్రతిపాదనలకు సానుకూలంగా సి ఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.