Reading Time: < 1 minute

ముంబై/బెంగళూరు: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరిపడా గ్యాస్ ఉత్పత్తి, సరఫరా మందగించడంతో వివిధ రంగాలపై ఆ ప్రభావం పడుతోంది. గ్యాస్ కంపెనీలు సరిపడా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో ముంబై, బెంగళూరులో హోటళ్లను రెండు మూడు రోజుల్లో మూసివేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు హోటళ్ల అ సోసియేషన్లు లేఖలు కూడా విడుదల చేస్తున్నాయి. వంట గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో హోటళ్లు మూసివేయాల్సి ఉంటుందని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ శెట్టి ప్రకటించారు.