
హైదరాబాద్: ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ, రష్మికలు పెళ్లి చేసుకోగా.. అల్లు శిరీష్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ లిస్ట్‌లోకి యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆదివారం కావ్య అనే అమ్మాయితో శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగిందంటూ కొన్ని ఫోటోలు సోషల్‌మీడియాలో చెక్కర్లు కొట్టాయి. అయితే తన జీవిత భాగస్వామిని శ్రీనివాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేశాడు. ఆదివారం జరిగింది నిశ్చితారం కాదని.. అది కేవలం ఓ చిన్న వేడుక మాత్రమే అని పేర్కొన్నాడు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తానని అన్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కావ్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన శ్రీనివాస్.. ‘‘కావ్యమ్మకు.. జీవితానికి అందమైన సమయం ఉంది. అది నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నాపై విశ్వాసం ఉంచినందుకు, పాజిటివిటీ, అశేష చిరు నవ్వులతో నింపినందుకు థ్యాంక్స్. నీ మోముపై కూడా చిరు నవ్వులను ఎప్పటికీ వాడిపోనివ్వను. మనం కలిసి జీవించే క్షణం కోసం ఎంతో వేచి చూస్తున్నా.. – ప్రేమతో నీ శ్రీని’’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ జంటకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.