Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎల్బీనగర్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు ఎసిబికి చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసులో నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు ఎస్సైలు లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకుంటుండగా.. బాబునాయక్, ప్రమోద్‌ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ పోలీస్‌స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు.