
గచ్చిబౌలి: హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులు కల్తీ మాఫియా గుట్టు రట్టు చేశారు. 5 వేల లీటర్ల కల్తీ వంటనూనే, 5 టన్నుల కల్తీ గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.21 లక్షల విలువ చేసే నకిలీ పదార్ధాలను సీజ్ చేశారు. గచ్చిబౌలిలోని ఓ గోదాములో కల్తీ ఆహార పదార్ధాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఒటి పోలీసులు దాడులు నిర్వహించారు. నిత్యావసర వస్తువులు కల్తీ చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.