Reading Time: < 1 minute

ఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకూ అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో వెలుగుమట్ల బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకూ బాధితులకు ప్రభుత్వం అండగా లేదని విమర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి వైద్య సహాయం కూడా అందలేదని మండిపడ్డారు. అనంతరం ఖమ్మం జడ్పి కూడలిలో కవిత ఆందోళనకు దిగారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలని ధర్నా చేపట్టారు. బాధితులతో కలిసి జడ్పి కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పడంతో ఆమె నిరసనను విరమించుకున్నారు.