
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రజాభవన్‌లో నిర్వహించిన వేడుకల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు,. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మారుస్తామని అన్నారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీల పరిశ్రమలను నగరం బయటకు పంపిస్తామని పేర్కొన్నారు. ‘‘మహిళ జర్నటలిస్టుతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించకోవడం సంతోషంగా ఉంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. పోలీసు విభాగంతో సహా అవకాశం ఉన్న ప్రతి విభాగంలో మహిళ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది’’ అని సిఎం అన్నారు.
‘‘హైదరాబాద్‌లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్‌లోపు జిల్లాలకు తరలిస్తాం. హైదరాబాద్‌లో వంద శాతం ఇవి బస్సులను తెస్తున్నాం. డిసెంబర్ 9లోపు నగరంలో డీజిల్ బస్సులు ఉండవు. హైదరాబాద్‌లో ఎసి ఇవి బస్సులు తెస్తాం. ఇక ఇవి వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్స్ అవకాశం కల్పిస్తాం. కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఇవి స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నాం’’ అని సిఎం పేర్కొన్నారు.