Reading Time: < 1 minute

హైదరాబాద్: సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి న్యూజిలాండ్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ ఫిల్ అలెన్  సపారీలపై సెంచరీతో దూకుడుగా బ్యాటింగ్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫిల్ ఏడు ఇన్నింగ్స్ లలో 200 స్ర్టైక్ రేటుతో 289 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో పరుగుల వేటలో మూడో స్థానంలో ఉన్నాడు. అతడు ఫైనల్ లో చెలరేగితే మాత్రం కప్ కివీస్ సొంతం అవుతోంది. టిమ్ సెఫర్ట్ కూడా 274 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్లు సిఫర్ట్, అలెన్‌లు అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా ఏడు ఇన్నింగ్స్ లలో 11 వికెట్లు తీయడంతో పాటు 124 పరుగులు కూడా చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, మార్క్ చాప్‌మన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఫిలిప్స్, రవీంద్ర కూడా కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకుంటున్నారు. కెప్టెన్ సాంట్నర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్, నీశమ్, సోధి తదితరులతో కివీస్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభాంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.