Reading Time: < 1 minute

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం ఇది కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి ఫ్యాన్స్‌లో మామూలుగా క్రేజ్ లేదు. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా షూటింగ్ చేయని ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. అలా ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా మరో రేర్ రికార్డును సాధించిందని తెలుస్తోంది.

‘వారణాసి’ సినిమాకి ఉన్న క్రేజ్‌ని చూసి ఓవర్‌సిస్‌లోని ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా హక్కులను (భారతీయ భాషలకు గాను) ఏకంగా రూ.160 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట. ఇప్పటికే చిత్ర బృందానికి ఈ ఆఫర్ ఇచ్చిందని.. దానిపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఓవర్సీస్ హక్కులకు ఇన్ని కోట్లు దక్కించుకున్న తొలి భారతీయ సినిమాగా ఈ సినిమా రేర్ రికార్డును సాధిస్తుంది.

ఇక ఈ సినిమా టైటిల్ పరిచయంలోనే కాస్తంత స్టోరీని రివీల్ చేశారు. రాజమౌళి. ఈ యాక్షన్ అడ్వెంచర్-మైథలాజిల్ మూవీలో మహేశ్ బాబు రాముడిగా కూడా కనిపించనున్నారని టాక్. ఇక మందాకినీ పాత్రలో యూనివర్సల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. కీరవాణీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2027, ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.