
కాణిపాకం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సలహాదారు, ఐఎఎస్ అధికారి శ్రీనివాసరాజు శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఇఒ కె పెంచల కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం నవగ్రహాలయంలో కూడా శ్రీనివాసరాజు పూజలు నిర్వహించారు. ఆయనకు వేద మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలను ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. వారి వెంట ఆలయ ఎఇఒ రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఎఇఒ ధనపాల్, ఆలయ సూపరిండెంట్ కోదండపాణి, తదితరులు పాల్గొన్నారు.