
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి సిటీలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. మ్యారేజ్ బ్యూరో కార్యాలయంపై గత రాత్రి సమయంలో దాడి జరిగింది. ఈ దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రాజమండ్రి సిటీలో తరచూ పేకాట క్లబ్బులు, విచ్చలవిడిగా నకిలీ మద్యం, డ్రగ్స్ తో స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారు. సాయంత్రం ఆరు దాటి మహిళలు భయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు. రోజు రోజుకు పోకిరీల బెడద ఎక్కువ అవుతోందని స్థానికులు మండిపడుతున్నారు.