
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో మరో దారుణం జరిగింది.11 ఏళ్ల బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై తిరుచానూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను మహిళ రెండో వివాహం చేసుకుంది. సదరు మహిళకు మొదటి భర్తతో బాలిక (11)కు జన్మించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను వైద్య చికిత్సలు నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు తిరుచానూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.