Reading Time: < 1 minute

హైదరాబాద్: అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. హైదరాబాద్ జెఎన్ టియు స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రతిభను గుర్తించిందని, వారి శక్తికి తగ్గట్టు మహిళలకు కాంగ్రెస్ పదవులు కట్టబెట్టందని తెలియజేశారు. ఆర్థికంగా నిలబడానికి ఆడబిడ్డలకు అండగా నిలబడుతున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలకు మహిళల పేర్లు పెడుతున్నామని రేవంత్ పేర్కొన్నారు. మహిళలకు సంపూర్ణ భద్రత ఉందా అంటే కాస్త ఆలోచించాలని, సోషల్ మీడియా పెరగడంతో మహిళలపై వేధింపులు పరిధి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మహిళలపై వేధింపులు పట్టణాలకే పరిమితమయ్యేవి అని..మహిళల కోసం చట్టాలు చేసే ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు అని.. మహిళలు భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.