
తిరువనంతపురం: ఎసిలలో ఐదు పాములు కనిపించిన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. చెరువక్కల్ చెందిన మాధవ్ జె పణికర్ శ్రీకార్యం ప్రాంతంలో నివసిస్తున్నాడు. టెక్నో పార్క్ లో మాధవ్ స్టాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఎసిలో ఎదో కదలుతున్నట్టు అనుమానం కలిగింది. వెంటనే దగ్గరికి వెళ్లి చూడగా శబ్ధాలు వినిపించడంలో రంద్రంలో పరీక్షించి చూడగా పాముగా గుర్తించాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు ఎసి మెకానిక్‌ను పిలిపించాడు. టెక్నీషియన్ సాయంతో ఎసి ఓపెన్ చేసి చూడగా ఐదు పాములు కనిపించాయి. నాలుగు పాములను స్నేక్ క్యాచర్స్ బయటకు తీయగా ఒక పాము ఎసి పైపు ద్వారా బయటకు వెళ్లిపోయింది. ఆ ఇంటికి చెట్టు ఆనుకొని ఉండడంతో పాములు వచ్చాయని స్నేక్ క్యాచర్స్ తెలిపారు. చెట్టు నుంచి ఎసి పైపు లోపలికి వచ్చాయని వివరించారు. విషపూరిత సర్పాలు కావని చెప్పడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.