
ఖమ్మం: పెసర చేనులో మేక మేత మేసిందని దానిని గొడ్డలితో నరికి చంపి అనంతరం కాపరులపై దాడి చేసిన సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బచ్చోడు గ్రామానికి చెందని సోమనబోయిన మల్లూర్, పల్లె గురువయ్యలు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గోకినపల్లి వెంకన్నకు చెందిన పెసర చేనుకు సమీపంలో మల్లూర్, గురువయ్యలు మేకలు మేపుతున్నారు. మేక వెళ్లి వెంకన్న పెసరు చేనులోకి వెళ్లింది. కోపంతో రగిలిపోయిన వెంకన్న ఆ మేకను గొడ్డలతో నరికి చంపాడు. అనంతరం కాపరులు ప్రశ్నించడంతో వారిపై కూడా గొడ్డలితో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గురవయ్య తల పగలగా మల్సూర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరు కాపారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేఇస దర్యాప్తు చేస్తున్నారు.