
హైదరాబాద్: నగరంలో నడిబొడ్డున రాజభవన్ రోడ్డులో ఓ వైన్ షాపులో అగ్ని ప్రమాదంలో జరిగింది. శనివారం తెల్లవారుజామున వైన్ షాపు నుంచి పొగలు రావడంతో వాకర్స్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వైన్ షాపు సిబ్బంది అక్కడికి చేరుకొని డోర్లు ఓపెన్ చేశారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదంలో మద్యం బాటిళ్లు, సామాగ్రి దగ్ధమయ్యాయని, ఫ్రిజ్ లేదా వైరింగ్‌లో ఏర్పడిన షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.