
టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత్ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్లు శివమ్ దూబే 25 బంతుల్లో 43 పరుగులు, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు, హార్ధిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు, తిలక్ వర్మ ఏడు బంతుల్లో 21 పరుగులు సూర్యకుమార్ యాదవ్ ఆరు బంతుల్లో 11 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ ఏడు బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి విఫలమయ్యాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు చివరలో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అదరగొట్టడంతో విజయం సాధించారు. 89 పరుగులు చేసిన సంజూ శామ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టీమిండియా బ్యాట్స్ మెన్లు 19 సిక్స్ లు, 18 పోర్లు బాదారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు 12 సిక్స్ లు 21 ఫోర్లు కొట్టారు.