Reading Time: < 1 minute

కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ జంటగా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రం తో మరోసారి అలరించనున్నారు. శుక్రవారం ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈక్రమంలో గురువారం నాడు మీడియాకి ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో శ్రీ విష్ణు మాట్లాడుతూ .. “కంటెంట్ మూవీస్ ఎప్పుడు వచ్చినా మీడియా, ఆడియెన్స్ ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈ కంటెంట్ సినిమాకి ప్రేక్షకులు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ.. “ఈ మూవీ కోసం మా టీం నిద్రలేని రాత్రులు గడిపి పని చేసింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని తెలిపారు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ .. “నాని ‘మృత్యుంజయ్’ మూవీని చూశా రు. ఆయనకు నచ్చింది అని నాకు తెలిసిన తరువాత నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. ఆయన రివ్యూ ఎప్పుడూ తప్పదు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు నటన చాలా కొత్తగా ఉంటుంది. రెబా మోనికా పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెబా మోనికా జాన్, మనీషా ఎ. దత్, రమ్య, సుదర్శన్, అయ్యప్ప శర్మ, రచ్చ రవి పాల్గొన్నారు.