
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత్ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఈ సందర్భంగా సంజూ మీడియాతో మాట్లాడారు. జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్ అని ప్రశంసించారు. కీలక సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపుకు తిప్పాడని కొనియాడారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనకు వచ్చింది కానీ బుమ్రా ఈ అవార్డుకు పూర్తి అర్హుడని పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో క్లాస్ బౌలింగ్ తో మళ్లీ తనను తాను నిరూపించాడని సంజు మెచ్చుకున్నారు. వాంఖేడ్ పిచ్‌పై 250+ పరుగుల లక్ష్యం కూడా చేధించే అవకాశం ఉందన్నారు. కీలకమై సెమీఫైనల్ మ్యాచ్‌లో రాణించాడం చాలా ఆనందంగా ఉందని, గత మ్యాచ్‌లో ఫామ్‌నే ఇప్పుడు కొనసాగించానని వివరించారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 16 ఓవర్‌లో ఎనిమిది పరుగులు, 18 ఓవర్‌లో ఆరు పరుగుల మాత్రమే బుమ్రా ఇచ్చి మ్యాచ్‌ను గట్టెక్కించాడు.