Reading Time: < 1 minute

‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ‘బ్యాండ్ మేళం’ టీజర్, ట్రైలర్, మాస్ పెప్పీ సాంగ్ ‘తిప్పూ కుం టున్నావ్’, మంచి మెలోడీ సాంగ్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ వంటివి ఆడియెన్స్‌లో సినిమా పట్ల అంచనాల్ని పెంచేసింది. యూత్ ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలను సృష్టించిన ఈ చిత్రం శ్రీరాముడి ఆశీస్సులతో శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. మార్చి 26న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేశారు.