Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: రాబోయే రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ గురువారం వివిధ రాష్ట్రాల నుండి ఆరుగురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా వెల్లడించారు. ఈ జాబితాలో తెలంగాణ నుండి ఇద్దరు, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు నుండి ఒక్కొక్కరు ఉన్నారు. తెలంగాణ నుండి అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి.. ఛత్తీస్‌గఢ్ నుండి ఫూలో దేవి నేతమ్.. హర్యానా నుండి కరంవీర్ సింగ్ బౌధ్.. హిమాచల్ ప్రదేశ్ నుండి అనురాగ్ శర్మ.. తమిళనాడు నుండి ఎం క్రిస్టోఫర్ తిలక్ ఉన్నారు.

కాగా, తెలంగాణలో అభిషేక్ సింఘ్వీ, కెఆర్ సురేష్ రెడ్డిల ప్రస్తుత పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనున్నందున రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, శాసనసభలో పార్టీకి ఉన్న సంఖ్యా బలం కారణంగా సింఘ్వీ ఎగువ సభలో తన స్థానాన్ని నిలుపుకుంటారని సమాచారం.