
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా క్రేజీ కల్యాణం. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా ‘క్రేజీ కల్యాణం‘ మూవీ నుంచి టాలెంటెడ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ నటించిన బాల్ రాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తరుణ్ భాస్కర్ సూపర్ మ్యాన్ లా మంచి జోష్ లో కనిపిస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ‘క్రేజీ కల్యాణం’ సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.