Reading Time: < 1 minute

అయ్యో పాప.. ఏంటీ ఘోరం.. చెరువులో ముంచి.. 9నెలల చిన్నారిని చంపిన కన్నతల్లి

Caption of Image.

హైదరాబాద్  సిటీలోని ఎల్బీనగర్ పరిధి బైరామల్ గూడలో దారుణం జరిగింది. కన్న కూతురిని చెరువులో ముంచి హత్య చేసింది ఓ కసాయి తల్లి. అభంశుభం తెలియని చిన్నారిని నీటిలో ముంచి చంపడంతో  స్థానికంగా ఈ  ఘటన కలకలం రేపుతోంది. మద్యం మత్తులో చిన్నారిని హత్య చేసినట్లు  స్థానికులు,పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. 

 ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడలో నివాసముంటున్న ఇంజాపూర్  కు లోకసాని  రాజేశ్వరి స్థానికంగా నివాసముంటోంది. ఆదివారం ( ఆగస్టు 2) సాయంత్రం  కడుపున పెట్టిన బిడ్డ  9నెలల చిన్నారి అనురాధను పక్కనే ఉన్న చెరువులో ముంచి హత్య చేసింది. చిన్నారి హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు నిందితురాలిని పట్టుకొని  పోలీసులకు అప్పగించారు.

►ALSO READ | బాలానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి

ఘటన సమయంలో నిందితురాలు రాజేశ్వరి మద్య మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోస్ట్  మార్టమ్ కోసం చిన్నారి మృతదేహాన్ని  ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.