
అయోధ్య విరాళాల చోరీ ఘటనపై పార్లమెంటులో స్కిట్ చేసిన పప్పూ యాదవ్ పై దాడి జరిగింది. ఢిల్లీలోని తన ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సందర్భంలో దుండగుడు దాడికి దిగాడు. ఆదివారం (ఆగస్టు 02) సాయంత్రం జరిగిన ఈ ఘటన ఢిల్లీ వ్యాప్తంగా కలకలం రేపింది.
మొదట షూ విసిరిన వ్యక్తి.. ఆ తర్వాత కత్తి తీసి దాడి చేసే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన అనుచరులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి యత్నించిన వ్యక్తిని పట్టుకుని చితకబాదిన పప్పు యాదవ్ అనుచరులు పోలీసులకు అప్పగించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ పప్పూ యాదవ్.. ఇలాంటి దాడులకు నేను భయపడను. ఎవరైనా నన్ను చంపాలనుకుంటే చంపనివ్వండి అని కామెంట్ చేశారు.
అయోధ్య విరాళాల చోరీ ఘటనపై విపక్షాలు ఆందోళన చేస్తున్న సందర్భంగా.. 2026 జులై 31న బీహార్ ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్ స్కిట్ చేశారు. కాషాయ దుస్తుల్లో వచ్చి.. హుండీలతో కూర్చుని స్కిట్ చేశారు. విపక్ష ఎంపీలు విరాళాలు ఇచ్చారు. విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్కిట్ లో పాల్గొన్నారు. విరాళాలు అందించారు.
►ALSO READ | ఇండియాను ప్రేమిస్తున్నాం అంటారు.. దుబాయ్ లో సెటిల్ అవుతారు! వివేక్ ఒబేరాయ్, మాధవన్పై థాక్రే విమర్శలు
విరాళాలను అన్నింటినీ దేవుడికి దండం పెట్టి జేబులో పెట్టుకుంటాడు పప్పూ యాదవ్. రామమందిరం విరాళాలు ఏ విధంగా దోపిడీ అయ్యాయి.. అని చెబుతూ పప్పూ యాదవ్, రాహుల్ గాంధీ ఈ స్కిట్ ద్వారా నవ్వులు పూయించారు. ఎంపీలందరూ చోర్ చోర్.. అంటూ నినాదాలు చేశారు. పార్లమెంటు ఆవరణం అంతా చందా చోర్.. గద్దీ చోడ్.. అంటూ చేపట్టిన వినూత్న నిరసన వైరల్ గా మారిన విషయం తెలిసిందే.