Reading Time: < 1 minute

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 27 గేట్లు ఎత్తివేత

Caption of Image.

ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి లక్షా56వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 27 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. మరోవైపు ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో  11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. 

 జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం  318.516. మీటర్లుకాగా ప్రస్తుతం నీటిమట్టం 317.33 మీటర్లు గా ఉంది.  ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 7.334 టీఎంసీలు గా ఉంది. ప్రాజెక్టునుంచి 27 గేట్లు ఎత్తి లక్షా 58వేల 702 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.     

ఇక ప్రాజెక్టు  ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతోంది. రెండు కేంద్రాల్లోని 11 యూనిట్లనుంచి డైలీ 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.