
గత వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. గురువారం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా మూకుమ్మడిగా దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా ఇరాన్ వైమానిక దాడులు చేస్తోంది. బహ్రెయిన్ లో యూఎస్ నేవీ ఫ్లీట్ పై.. ఖతార్ లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ దాడి చేసింది. అలాగే, ఇజ్రాయెల్ పై కూడా ఇరాన్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతోంది. టెల్ అవీవ్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో ఎటాక్ చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాలు తమ దాడులను పెంచాయి. ఇరాన్ వార్ షిప్ లను లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. ఇరాన్ ఇప్పటివరకు 500కు పైగా బాలిస్టిక్ మిస్సైల్స్.. 2 వేలకు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లు అమెరికా ప్రకటించింది.
కాగా, ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు అధికారులతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడులు ఇంకా కొనసాగుతుండటంతో ఇరాన్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.