Reading Time: < 1 minute

కోల్‌కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌‌లో సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సఫారీలను బ్యాటింగ్‌కి అహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సౌతాఫ్రికా 12 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 55 పరుగుల వద్ద కెప్టెన్ మార్క్‌రమ్(18) ఔట్ అయ్యాడు. ఈ దశలో డెవాల్డ్ బ్రెవిస్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం డేవిడ్ మిల్లర్(6) స్వల్పస్కోర్‌కే పెవిలియన్ చేరాడు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టబ్స్(7), జెన్సన్ (17) ఉన్నారు.