Reading Time: < 1 minute

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని మూడు ప్రముఖ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తు లు బెదిరింపులు పంపడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కపిలతీర్థం దగ్గర రాజ్ పార్క్ హోటల్, పాయ్ వైస్రాయ్, ఉప్పరపల్లిలోని ఎస్ ఆర్‌బి హోటళ్లను పేల్చేస్తామంటూ గుర్తు తెలియన వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని గంటల్లోనే తిరుపతిలో హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. హోటళ్ల సిబ్బంది సమాచారంతో అప్రమత్తం అయిన పోలీసులు తనీఖీలు చేపట్టారు.

బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీంలతో హోటల్ గదులు, పార్కింగ్ ఏరియా, లాబీల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా హోటళ్లను ఖాళీ చేయించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి బాంబు సంబంధించిన వస్తువులు లభించలేదు. ప్రముఖులు విడిది చేసే ఇలాంటి హోటళ్లకు బెందిరింపులు రావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈమెయిల్స్ ఎక్క డినుంచి వచ్చాయి? ఎవరూ పంపించా రు? అనే అంశాలతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ టీం ఈ-మెయిల్ ఐడిలను ట్రాక్ చేస్తోంది.