Reading Time: < 1 minute

ఏప్రిల్ 1, 2026 నుంచి అమ్మనున్న E20పెట్రోల్ రేటు ఎంత ఉండొచ్చంటే..

Caption of Image.

భారతదేశంలో సాధారణ పెట్రోలులో 91RONగా ఉంటుంది. ఏప్రిల్ 1,  2026  నుంచి  అమ్మనున్న E–20 పెట్రోలులో కనీసం 95 RON కలిగి ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. స్వచ్ఛమైన  ఇథైల్  ఆల్కహాల్ చాలా ఎక్కువ  RON  రేటింగ్ (~108–110 RON)  కలిగి ఉంటుంది. 20% ఇథైల్ ఆల్కహాల్ కలపడం వలన సాధారణంగా పెట్రోలుతో పోలిస్తే RON 5–6 పాయింట్లు పెరుగుతుంది.

మోడర్న్​ ఇంజిన్లకు  (2023 తర్వాత వచ్చినవి)  బెటర్  పనితీరు ఉంటుంది. అందుకే  E–20 పెట్రోలుకు   కనీసం 95 RON  కలిగి ఉండాలని  ప్రభుత్వం  ఆదేశించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న  సమాచారం  ప్రకారం E20పెట్రోల్​కు  వేరే ధర లేదు.  ఏప్రిల్ 1, 2026  నుంచి E–20 పెట్రోల్  సాధారణ పెట్రోల్ ధరతోనే  అమ్ముతారు. ఉప్పల్ కలాన్ (హైదరాబాద్ ప్రాంతం)లో  ప్రస్తుతం  లీటరుకు  107.46  రూపాయలు  ఉన్నది.  ఏప్రిల్ 1 నాటికి కూడా (క్రూడ్ ఆయిల్ ధరలు మారకపోతే) సుమారు  లీటరుకు 107–108 రూపాయలు మధ్యే ఉండవచ్చు.

ఇథైల్ ఆల్కహాల్ క్రూడ్ ఆయిల్ కంటే చౌకగా దొరుకుతుంది. కానీ, పెట్రోల్ పంప్ ధరలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర వ్యాట్​, డీలర్ కమీషన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి  పూర్తిగా తగ్గించలేదు. బ్రెజిల్,  అమెరికా, యూరప్ వంటి మార్కెట్లు ఇప్పటికే  ఇథైల్ ఆల్కహాల్ బ్లెండెడ్ పెట్రోలును ఉపయోగిస్తున్నాయి.  E–20 పెట్రోలు వలన ఎనర్జీ సెక్యూరిటీ,  విదేశీమారక  ద్రవ్యాన్ని ఆదా చేయటం,  గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపు ద్వారా  వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం మొదలగు అనేక ఆర్థిక,  పర్యావరణ ఉపయోగాలు ఉన్నాయి.

©️ VIL Media Pvt Ltd.