Reading Time: < 1 minute
Oppo India Holi Offers Zero Down Payment No Cost Emi On Reno Series Find X9 Series

Reno Series & Find X9 series: హోలీ పండుగ సందర్భంగా OPPO India ప్రత్యేక ప్రమోషనల్ స్కీమ్స్‌ను ప్రకటించింది. మార్చి 1 నుంచి మార్చి 8 వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉండనున్నాయి. జీరో డౌన్ పేమెంట్‌తో పాటు గరిష్టంగా 24 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన రెనో, ఫైండ్ X9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై అందుబాటులో ఉంటాయి. అంతేకాదు బ్యాంక్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై క్యాష్‌ బ్యాక్ ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది.

Pakistan Afghanistan War: పాక్ ప్రధాని ఆఫీసుకు 5 కి.మీ దూరంలో ఆఫ్ఘాన్ దాడి.. వణికిన ఇస్లామాబాద్..

“మేక్ యువర్ మూమెంట్” వ్యూహంలో భాగంగా పండుగ వేళల్లో ప్రత్యేక క్షణాలను మెరుగైన కెమెరా, పోర్ట్రెట్ ఫీచర్లతో ఈ ఆఫర్లను తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్లలో భాగంగా OPPO Reno 15 Pro Mini (256GB, 512GB) మోడల్‌పై 24 నెలల వడ్డీ లేని ఈఎంఐ సౌకర్యం లభిస్తుంది. అయితే ఈ 24 నెలల జీరో డౌన్ పేమెంట్ స్కీమ్ కేవలం కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీసీఐ బ్యాంకు ద్వారా పేపర్ ఫైనాన్స్ ఆప్షన్‌లో మాత్రమే వర్తిస్తుంది.

Earthquake In Kolkata: వణికిన కోల్‌కతా.. బంగ్లాదేశ్‌ కేంద్రంగా 5.4 తీవ్రతతో భూకంపం!

ఇక OPPO Find X9 (12GB+256GB, 16GB+512GB)పై 18 నెలల వరకు, OPPO Reno 15 (8GB+512GB, 12GB+256GB, 12GB+512GB)పై 15 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ అందుబాటులో ఉంది. అలాగే OPPO A6 Pro (8GB+128GB, 8GB+256GB)పై 8 నెలలు, OPPO A6 (4GB+128GB, 6GB+128GB, 6GB+256GB)పై 6 నెలల వరకు ఈఎంఐ సదుపాయం కల్పించారు. ఇవే కాకుండా.. ఆఫర్ కాలంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో (ఈఎంఐ & నాన్-ఈఎంఐ లావాదేవీలపై) గరిష్టంగా 10% వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులకు కూడా 10% క్యాష్‌ బ్యాక్ అందుబాటులో ఉంటుంది.