Reading Time: < 1 minute

వనపర్తి జిల్లాలో విషాదం.. ఇంత హ్యాపీగా ఉన్న ఈ ఇద్దరికీ ఏమైందో.. ఇలా చేశారు !

Caption of Image.

వనపర్తి: వనపర్తి జిల్లాకు చెందిన ప్రేమ జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన కేత్రావత్ వసంత అనే యువతి బాసర ఐఐటీ హాస్టల్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వనపర్తి మండలం అప్పయ్య పల్లి శివారులోని కిర్యా తండా చెందిన గణేష్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఇద్దరు చనిపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వసంత, గణేశ్.. ఇద్దరూ బంధువులు అని తెలిసింది. వసంత ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతుంది.

వసంత హాస్టల్  గదిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసి పోలీసులు స్పాట్ కు వెళ్లారు. వసంత మృతదేహాన్ని భైంసా అసుపత్రికి తరలించారు. వసంత తల్లిదండ్రులకు కాల్ చేసి విషయం చెప్పారు. భైంసా ఆసుపత్రి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

►ALSO READ | నిజామాబాద్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం.. చెవి నొప్పితో హాస్పిటల్లో చేరిన యువకుడు మృతి

హాస్టల్లో రూమ్మేట్స్ను, ఐఐటీ క్యాంపస్లో వసంత ఫ్రెండ్స్ ను పోలీసులు ఆమె గురించి ఆరా తీశారు. వసంత ప్రేమలో ఉందనే విషయం మాత్రం పోలీసులు విచారణలో స్పష్టమైంది. గణేష్, వసంత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

©️ VIL Media Pvt Ltd.