
టాప్ హీరో హీరోయిన్స్.. విజయ్ దేవరకొండ, రష్మిక ఒక్కటి అయ్యారు. పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఉదయ్ పూర్ కోటలో ధూంధాంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీడియాకు నో ఎంట్రీ.. జస్ట్ లీక్స్ మాత్రమే.. ప్రధాని మోడీ నుంచి సినీ, రాజకీయ ప్రముఖలు అందరూ విషెస్ చెబుతున్నారు.. విరోష్ వెడ్డింగ్ లైవ్ అప్ డేట్స్ మీ కోసం….
- రష్మిక బెంగళూరులోని రామయ్య కళాశాలలో చదువుకుంది. విజయ్ హైదరాబాద్‌లోని బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందాడు.
- విజయ్, రష్మికల వివాహం రెండు వేర్వేరు సంప్రదాయాల్లో జరగనుంది. ఉదయం తెలుగు పద్ధతిలో విజయ్ ఇంటి ఆచారం ప్రకారం, సాయంత్రం రష్మిక కుటుంబానికి చెందిన ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరగనున్నాయి.
- విజయ్ దేవరకొండకు 30 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ విమానం ఉందని సమాచారం.
- విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరి ఆస్తులు కలిపి రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో విజయ్ ఆస్తుల విలువ 66 నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఉంది. రష్మిక ఆస్తుల విలువ 60 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం.
- విజయ్–రష్మికల మధ్య ఏజ్ గ్యాప్ 7 ఏళ్లు. రష్మిక ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని విరాజ్‌పేటలో జన్మించగా, ప్రస్తుతం ఆమె వయస్సు 29 సంవత్సరాలు. విజయ్ దేవరకొండ మే 9, 1989న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన వయస్సు 36 సంవత్సరాలు.
- మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పెళ్లికి హాజరయ్యారు. 2017లో విజయ్ తో అర్జున్ రెడ్డి మూవీ చేయగా.. ఆ తర్వాత 2023లో యానిమల్ మూవీలో రష్మిక నటించింది. వీళ్లిద్దరితో సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన రెండు మూవీలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
- విజయ్ దేవరకొండ తల్లి తమ కుటుంబ వారసత్వంగా వచ్చిన గాజులను రష్మిక మందన్నకు బహుమతిగా ఇచ్చింది.
- ఉదయ్ పూర్ కోటలో గ్రాండ్ గా జరుగుతున్న పెళ్లి వేడుకకు చేరుకున్న పూజారులు. హైదరాబాద్ నుంచి నలుగురు పూజారులు హాజరు. సంప్రదాయ పద్దతిలో పెళ్లి జరిపించనున్న పండితులు.
- భారత ప్రధాని నరేంద్ర మోడీ కాబోయే నూతన వధూవరులకు (విజయ్, రష్మికలకు) శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ స్పెషల్ నోట్ ద్వారా విషెస్ అందించారు. ఈ వివాహం వారి జీవితాల్లో “అందమైన కొత్త అధ్యాయం” ప్రారంభమవుతుందన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంలో భాగంగా ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్న ఈ క్షణం ఎంతో విశిష్టమని పేర్కొన్నారు.
ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ‘Virosh Premier League’ (VPL) పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక షేర్ చేసింది. ఫోటోలో క్రికెట్ గ్రౌండ్ మార్కింగ్ కనిపిస్తుండగా, విజయ్ అదే పేరుతో ఉన్న ‘పాప్‌కార్న్ బకెట్’ ఫోటోను షేర్ చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.