
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పదే పదే ఇండియా, పాకిస్తాన్ యుద్దాన్ని తానే ఆపాను అని చెప్పిన ట్రంప్ మరోసారి అదే పాట పాడారు. అయితే ఈసారి కొత్త రాగంలో అందుకున్నారు. ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ యుద్దాన్ని నేనే ఆపాను.. లేకుంటే ఆ యుద్దంలో పాక్ ప్రధాని చనిపోయి ఉండేవారని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన 11 నెలల్లో అనేక యుద్దాలను ఆపానన్నారు ట్రంప్. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ న్యూక్లియర్ యుద్దాన్ని నా ప్రమేయంతో నిలిచిందన్నారు. యుద్దమే గనక జరిగితే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బతికి ఉండేవాడు కాదు అని అన్నారు.
గతంలో కూడా ఇండియా, పాక్ సంక్షోభంపై ట్రంప్ అనేకసార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇండియాపాక్ యుద్దంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్దాలు నేను ఆపగలిగాను.. నేను ప్రపంచ శాంతి బహుమతికి అర్హుడనని కూడా ప్రకటించారు. అయితే దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.
Also Read : మోదీకి ధైర్యం ఉంటే.. అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలి
2024 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు చనిపోయిన తర్వాత ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్టయిక్ చేసింది. ట్రంప్ వ్యాఖ్యలను చాలాసార్లు ఖండిస్తూ మూడో పక్ష ప్రమేయం లేకుండానే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వైపాక్షిక చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని తేల్చి చెప్పింది.
అయితే ట్రంప్ ప్రమేయంపై పాక్ ప్రధాని మాత్రం పదేపదే మాటమార్చారు. పీస్ ఆఫ్ మండలి సమావేశంలో కూడా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్ జోక్యంపై ప్రశంసలు కురిపించారు. శాంతిమనిషి , దక్షిణాసియా ప్రజల రక్షుకుడు పొగడ్తలతో ముంచెత్తాడు. ట్రంప్ తాజా ప్రకటనతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
JUST IN: 🇮🇳🇵🇰 President Trump says India and Pakistan would be fighting a “nuclear war” if he didn’t stop it.
“People said the Prime Minister of Pakistan would’ve died.” pic.twitter.com/EaNwIYqgG0
— BRICS News (@BRICSinfo) February 25, 2026